హాంకాంగ్ చిత్తు..

ఆసియా కప్ 2025లో ఆఫ్ఘనిస్తాన్ ఆరంభం చేసింది. అబుదాబిలో జరిగిన ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో ఆఫ్గాన్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న రషీద్ ఖాన్ సేన‌… నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

బ్యాటింగ్‌లో సెదికుల్లా అటల్‌ అజేయంగా నిలిచి 73 పరుగులు చేయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్‌ కేవలం 21 బంతుల్లోనే 53 పరుగులు బాదాడు. వీరిద్దరి హాఫ్‌ సెంచరీలు జట్టుకు ఊపునిచ్చాయి. అలాగే మహమ్మద్‌ నబీ 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

అనంతరం 189 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన హాంకాంగ్‌ జట్టు ఆఫ్ఘాన్‌ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. టాప్‌ ఆర్డర్‌ నుంచే వికెట్లు వరుసగా కోల్పోయి బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 94 పరుగులకే పరిమితమయ్యారు.

ఆఫ్ఘాన్‌ బౌలర్లలో ఫజల్‌హక్‌ ఫరూకీ (1/15), రషీద్ ఖాన్‌ (1/24), అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (1/4), నూర్ అహ్మద్‌ (1/16), గుల్బదిన్‌ నాయిబ్‌ (2/8) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థి జట్టును మట్టికరిపించారు.

ఫలితంగా లక్ష్యఛేదనకి దిగిన హాంకాంగ్‌ జట్టు ఆఫ్ఘాన్‌ బౌలర్లకు పూర్తిగా లొంగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 94 పరుగులకే పరిమితమైంది. దీంతో అఫ్ఘానిస్తాన్‌ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో విజయంతో, ఆఫ్ఘనిస్తాన్ రెండు పాయింట్లతో గ్రూప్ బిలో మొదటి స్థానానికి చేరుకుంది.

Leave a Reply