ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్ !!

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ జరిగింది.

మంగళవారం (సెప్టెంబర్ 9) ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 96 శాతం మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికల సంఘం పార్లమెంట్ భవనం లోపల ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటు వేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.

Leave a Reply