దర్శనానికి తిరుమల కొండెక్కుతున్న మల్లారెడ్డి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Chamakura Malla Reddy) రేపు జన్మదినం సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు బయలు దేరారు. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.
అనంతరం అలిపిరి (Alipiri) మొదటి మెట్టు వద్ద శ్రీవారికి పూజలు చేసిన నడక దారిన కొండ ఎక్కడం ప్రారంభించారు. ఆయనతోపాటు మల్లారెడ్డి అభిమానులు కూడా పాల్గొన్నారు. సుమారు 71 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సహంగా శ్రీవారి దర్శనానికి ( Srivari darshanam) నడకదారిలో వెళ్లడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
