శోభాయనంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ

శుభప్రదం పౌర్ణమి గిరిప్రదక్షిణ

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : విజయవాడ (Vijayawada)లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల పౌర్ణమి గిరి ప్రదక్షిణ అత్యంత శోభాయమానంగా జరిగింది. ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి (Kanakadurga Ammavari) పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఆదివారం వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టి గిరి ప్రదక్షణను ప్రారంభించారు.

గిరి ప్రదక్షిణలో అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొనగా ఆదిదంపతులు (the first couple) నగర వీధుల్లో విహరించారు. ఈవో, స్థానాచార్యులతో పాటు అధికారులు అందరూ కలిసి కలసి యువ భక్తులతో కోలాటం ఆడారు. దీంతో భక్తుల్లో, ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది. ముఖ్య అర్చక ఆర్. శ్రీనివాసశాస్త్రి కార్యక్రమంలో పాల్గొని స్ధానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. పౌర్ణమి రోజు ఆదివారం వేకువజామునే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కనుల పండువగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు.

పౌర్ణమి గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందుతారు. ఈ గిరి ప్రదక్షిణలో ఆలయ పి. ఆర్. వొ కె. గంగాధర్ భక్తిగీతాలు, కోలటాలు, సంప్రదాయ జానపద కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొని వచ్చారు.

Leave a Reply