ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఈ రోజు ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. సంపూర్ణ చంద్రగ్రహణం (Total lunar eclipse) ఏర్పడబోతోంది. ఆదివారం రాత్రి 9.58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సోమవారం ఉదయం 1.26 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3గంటల 28 నిమిషాలు ఉంటుంది. చంద్ర గ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెబుతున్నారు.
గ్రహణం సమయంలో జాగ్రత్తలు
- గర్భిణులు(pregnant women), చిన్న పిల్లలు, వృద్ధులు (elderly people) బయటకు వెళ్లకపోవటం మంచిది.
- గ్రహణం సమయంలో చంద్రుడి(moon)ని చూడటం వల్ల కడుపులోని బిడ్డకు హానికరమని నమ్ముతారు.
- గ్రహణం సమయంలో పూజలు చేయొద్దు.
- ఆర్థిక, భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దు.
- ఇంట్లోని అన్ని వస్తువులపై దర్భలను, లేదా తుసి దళాలను వేసుకుంటే మంచిది.
- గ్రహణం సమయంలో దైవ నామస్మరణ, ధ్యానం చేయడం చాలా మంచిది.
- గ్రహణానికి ముందు, తరువాత తప్పనిసరిగా తలస్నానం చేయాలి.

