రూ.100కే క్రికెట్ మ్యాచ్ చూసేయొచ్చు..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : క్రికెట్ మ్యాచ్ (A cricket match)ను స్టేడియం (stadium)లో చూడాలంటే వేల రూపాయ‌లు పెట్టి టికెట్ కొనాల్సిందే. అంత ధ‌ర పెట్టినా టికెట్లు దొరుకుతాయ‌నే న‌మ్మ‌కం ఉండ‌దు. అయితే కాస్ట్‌లీగా ఉండే టికెట్లు ఇక‌పై చౌక‌గా దొర‌క‌నున్నాయి. 2025 మహిళల వన్డే వరల్డ్​ కప్ (Women’s ODI World Cup) సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్​కు భారత్ (India), శ్రీలంక (Sri Lanka) ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ (BCCI) గుడ్ న్యూస్ చెప్పింది. అతి తక్కువ ధరకే మ్యాచ్​లను చూసేలా ప్రేక్షకులకు ఆఫర్ ప్రకటించింది. టోర్నమెంట్​ తొలి దశలో జరగనున్న అన్ని లీగ్‌ మ్యాచ్‌ల టికెట్ల ధరను రూ.100గా నిర్ణయించారు.

గూగుల్‌ పే యూజర్లకు మాత్రమే…
అయితే మహిళల క్రికెట్ (Women’s cricket)​కు ప్రోత్సాహం అందించేలా, అత్యధిక మంది ప్రేక్షకులను స్టేడియాలకు (stadiums) రప్పించాలన్న ఉద్దేశంతోనే ఇంత తక్కువ ధరకు టికెట్లను అమ్ముతున్నారు. అయితే ప్రముఖ యూపీఐ యాప్ (UPI App) గూగుల్‌ పే యూజర్లకు (Google Pay users) మాత్రమే ఈ తొలి దశ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబరు 9న టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఆ ఐదు స్టేడియాల్లో..
మ‌హిళ‌ల వర‌ల్డ్ క‌ప్‌న‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్​లో నాలుగు స్టేడియాలు, శ్రీలంకలో ఒక స్టేడియం ఎంపిక చేశారు. ఇందులో భారత్ నుంచి డీవై పాటిల్ స్టేడియం (నవీ ముంబయి), అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (గువాహటి), విశాఖపట్టణం స్టేడియం (ఆంధ్రప్రదేశ్), హోల్కర్ స్టేడియం (ఇందౌర్)తోపాటు శ్రీలంకలో కొలంబో మైదానం ఈ టోర్నీకి వేదికలు కాను​న్నాయి.

Leave a Reply