గోదావరిఖని (పెద్దపల్లి జిల్లా), ఆంధ్ర‌ప్ర‌భ : సింగరేణి బొగ్గు పరిశ్రమలో వారసులకు యజమాన్యం గుడ్ న్యూస్(Good news) చెప్పింది. కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన వారసులకు మంచి అవకాశం లభించబోతుంది. గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు కల్పించే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టుల(Clerical Grade-3 posts)ను ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించింది.

గుర్తింపు కార్మిక సంఘంతో జరిగిన 51 వ నిర్మాణాత్మక సమావేశంలో జరిగిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్(CMD N. Balaram) ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సింగరేణి(Singareni) గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్(Workers) యూనియన్(ఏ ఐ టి యుసి)తో యాజమాన్యం ద్వైపాక్షిక ఒప్పందం, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం చేసుకోనుంది.

అనంతరం దీనికి సంబంధించిన పూర్తిస్థాయిలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. గతంలో పట్టభద్రుల (డిగ్రీ)విద్యార్హత కలిగిన వారు జనరల్ అసిస్టెంట్‌గా మాత్రమే పనిచేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మూలంగా వారసులకు మంచి అవకాశం లభించినట్లు అవుతుంది.

అయితే 2009 లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం టెక్నికల్ డిగ్రీలైన మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా(మైనింగ్ / మెకానికల్ /ఎలక్ట్రికల్), ఐటీఐ(ఎలక్ట్రికల్/ ఫిట్టర్ / వెల్డర్)((Mining / Mechanical / Electrical), ITI (Electrical / Fitter / Welder)) కోర్సులు పూర్తి చేసిన వారికి విద్యార్హతల కు తగిన ఉద్యోగాలు కల్పించడానికి అంగీకరించారు. తాజాగా డిగ్రీ అర్హతను కూడా చేర్చి గ్రేడ్ -3 క్లర్కు ఉద్యోగాలను కల్పించడానికి నిర్ణ‌యించారు. అయితే ఒకవేళ మరణించిన ఉద్యోగి కుటుంబంలో అర్హులైన టెక్నికల్ డిగ్రీ ఉన్న వారసులు లేనిపక్షంలోనే డిగ్రీ అర్హత ఉన్న వారిని గ్రేడ్ 3 క్లర్కు పోస్టు అభ్యర్థిత్వానికి పరిశీలిస్తారు.

Leave a Reply