అమరావతి : దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (Quantum Computing Center) స్థాపనకు రంగం సిద్ధమైంది. అమరావతిలో గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) ఈ కేంద్రాన్ని వచ్చే సంవత్సరం మార్చిలో ప్రారంభించనున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ వెల్లడించారు.
అమరావతి త్వరలో ప్రారంభం కానున్న టెక్ పార్క్‌లో IBM Quantum System–2 ని ఏర్పాటు చేయడానికి ఐబీఎం–టీసీఎస్(IBM–TCS) కలిసి పని చేయబోతున్నాయి. దీని ద్వారా భారత్ క్వాంటం టెక్నాలజీ(Bharat Quantum Technology) రంగంలో ముందంజలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐబీఎం(IBM)కు అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, స్పెయిన్లలో తొమ్మిది సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరబోతోంది.
దీంతో అమరావతి కేవలం రాజధానిగా కాకుండా, భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీకి ప్రధాన హబ్‌గా మారబోతోందన్న అంచనాలు పెరిగాయి. గత సంవత్సరం సీఎం చంద్రబాబు నాయుడు “క్వాంటం వ్యాలీ” (Quantum Valley) ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం అమరావతిలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ(Hi-Tech City in Hyderabad) తరహాలో ఒక ప్రత్యేక భవనం నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు.
ఈ ప్రాజెక్టులో టీసీఎస్ (TCS), ఎల్ అండ్ టీ (L&T) ఇప్పటికే భాగస్వాములు కాగా, ఇప్పుడు ఐబీఎం కూడా చేరడం ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్ర జీడీపీ(State GDP) పెంపుతో పాటు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు, తెలుగు యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు పలు ఆధునిక టెక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్(Visakhapatnam as IT hub)గా, అమరావతిని హైటెక్ టెక్నాలజీల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక మార్చిలో ప్రారంభం కానున్న ఐబీఎం ప్రాజెక్ట్(IBM Project)తో అమరావతిపై పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా, భారత్ టెక్నాలజీ భవిష్యత్తుకి కూడా కీలక మలుపు అవుతుంది. ఐబీఎం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని భావిస్తున్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(Quantum Computing Center) స్థాపనతో, దేశంలోనే తొలి అడ్వాన్స్డ్ టెక్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తెచ్చుకోబోతోంది.