హైదరాబాద్, ఆంధ్రప్రభ : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సురవరం సుధాకర్ రెడ్డి పనిచేశారని, ఆయన జీవితం ఆదర్శప్రాయమైనదని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Retired CJI Justice NV Ramana) అన్నారు. శనివారం రవీంద్రభారతిలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఇబ్బందులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడి (Parliamentary Standing Committee) గా నివేదికలు ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపట్టారని తెలిపారు. తనకు కూడా వామపక్ష భావజాలం పట్ల అభిమానం ఉందని పేర్కొన్నారు. సురవరం ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారని కొనియాడారు.
గొప్ప ప్రజాస్వామికవాది: బీవీ రాఘవులు
సురవరం గొప్ప ప్రజాస్వామిక వాది అని సీపీఏం జాతీయ నేత సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (BV Raghavulu) అన్నారు. దశాబ్దానికిపైగా సురవరం (Suravaram). తాను కలిసి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అనేక పోరాటాలు, ఉద్యమాల్లో కలిసి పని చేసినట్లు వివరించారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు.
నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేసిన సురవరం…
సురవరం సుధాకర్ రెడ్డి నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. తాను ఎన్ఎస్ఈయూఐ నాయకుడిగా ఉన్నప్పుడు తొలిసారి సురవరం సుధాకర్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో మళ్లీ కలిసినట్లు చెప్పారు. కమ్యూనిజం ఎప్పుడూ సజీవంగా ఉంటుందన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రొఫెసర్ హరగోపాల్, గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు.