10,116 స్పటిక లింగాలతో ప్రతిష్ఠ
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లా 36వ వార్డు వెంకంపేటలో రామ్లాల్ మండపం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 10, 116 స్పటిక (Crystal) లింగాలతో గణపతిని ప్రతిష్టించారు. ఇలాంటి గణపతిని ప్రతిష్ఠించడం దేశంలోనే తొలిసారి అని చెప్పారు. 15 ఏళ్లపాటు వివిధ రంగులు, రూపాలలో గణపతులను ఏర్పాటు చేశామని, 16వ ఏట నుంచి పర్యావరణ(Environment) పరిరక్షణను బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుతున్నామన్నారు.

ఎలాంటి రసాయన (Chemistry) పదార్థాలను ఉపయోగించుకుండా గత ఏడాది రుద్రాక్ష (Rudraksha) గణపతిని ఏర్పాటు చేశామని, ఈసారి కూడా వినూత్నంగా స్పటిక లింగాలతో గణపతిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ లింగాలను చివరి రోజు టోకెన్ (Token)తీసుకున్న భక్తులకు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.