స్కాల‌ర్‌షిప్‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి : కేటీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : విద్యార్థుల (students) సమస్యలను పరిష్కరించడంలో రాష్ర్ట ప్ర‌భుత్వం (state government) పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) విమ‌ర్శించారు. స్కాల‌ర్ షిప్‌లు విడుద‌ల చేయ‌కుండా తీవ్ర జాప్యం చేస్తుంద‌ని మండిప‌డ్డారు. స్కాల‌ర్‌షిప్ బ‌కాయిల‌పై అసెంబ్లీ (Assembly)లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. స్కాల‌ర్‌షిప్‌ల‌ను విడుద‌ల చేయ‌కుండా విద్యార్థుల జీవితాల‌తో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆడుకుంటున్నాడ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

పెండింగ్‌లో ఉన్న స్కాల‌ర్‌షిప్‌ల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయించాల‌ని, ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాల‌ని నిజాం కాలేజీ (Nizam College) విద్యార్థిని సుమ‌న ఎక్స్ వేదిక‌గా కేటీఆర్‌కు అభ్య‌ర్థ‌న చేయ‌గా ఆయ‌న ఈ విధంగా స్పందించారు. ఇటీవ‌లే నేను నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాను. టీసీ తీసుకునేందుకు వెళ్తే.. ఆర్టీఎఫ్ రూ. 28 వేలు, ఎంటీఎఫ్ రూ. 14 వేలు చెల్లించాల‌ని అడిగారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఫైన‌ల్ ఇయ‌ర్ స్కాల‌ర్‌షిప్ (Scholarship) చెల్లించ‌లేదు. మాది మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం.. ద‌య‌చేసి త‌క్ష‌ణ‌మే స్కాల‌ర్‌షిప్ బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని కోరుతున్న‌ట్లు సుమ‌న్ ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని త‌న దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ చెప్పారు కేటీఆర్.

Leave a Reply