బాసర పుణ్యక్షేత్రాన్ని తాకిన వ‌ర‌ద నీరు

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

బాసర, ఆంధ్రప్రభ : బాసర (Basara) పుణ్యక్షేత్రం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండడంతో ఆలయానికి చేరువలో వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆలయ పరిసరాలు (temple surroundings) జ‌ల‌మ‌యంగా మారాయి. హరిహర కాటేజ్(Harihara Cottage), వడ్డేపల్లి, దీక్ష, నక్షత్ర లాడ్జ్ చుట్టూ వరద నీరు చేరింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila), ఏఎస్పీ అవినాష్ కుమార్ ట్రాక్టర్ పై వెళ్లి వరద నీరు చేరిన ప్రైవేట్ లాడ్జిలను ప‌రిశీలించారు.

అక్క‌డ బాధితులను పరామర్శించి ఓదార్చారు. వారికి సరిపడా ఆహారాన్ని అందజేశారు. హరి హర కాటేజీలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని గజ ఈతగాళ్లు (swimmers) తెప్పల సహాయంతో వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. గోదావరి నది (Godavari River) వద్ద ఆలయ వైదిక బృందం గోదారమ్మ శాంతించు అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply