ఉమ్మడి మెదక్ బ్యూరో : ఉమ్మడి మెదక్ జిల్లా (Medak district in a state of emergency)లో వర్షాలకు సంభించిన నష్టాన్ని అంచనా వేయడానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి (district in-charge minister Vivek Venkataswamy) పరిశీలించారు. వరద పరిస్థితి చూసి చలించిపోయారు. హవేలీ ఘన్‌పూర్ (Haveli Ghanpur) మండలం లింసాన్పల్లి తండా వల్లే దారి, తిమ్మాయపల్లి వెళ్లే మార్గంలోని బ్రిడ్జ్ తిమ్మాయపల్లి వెళ్లే మార్గంలోని బ్రిడ్జ్ ను బూరుగుపల్లి రోడ్డును మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (District Collector Rahul Raj), అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో భారీ నష్టం ఏర్పడిందన్నారు.

బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి, ఎంపీ
నిజాంపేట : మెదక్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువుల కుంటలు అలుగులు పారుతున్నాయి. సిద్దిపేట-మెదక్ ఎన్‌హెచ్ 765 డిజి ప్రధాన రోడ్డుపై నందిగామ గ్రామ శివారులో ధ్వంసమైన బ్రిడ్జిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha), మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Medak MP Raghunandan Rao) వేర్వేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిథిలావస్థ చేరిన ఇండ్లలో ప్రజలు ఉండద్దని, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రమాదాన్ని అంచనా వేయాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్దకు కుంటల వద్దకు వెళ్లవద్దని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. ఈ సమయంలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నాయకులు ఉన్నారు.
