- ఎరువుల దుకాణం వద్ద బారులు తీరిన అన్నదాతలు
ఇల్లందకుంట : అన్నదాతలు యూరియా (Urea) కోసం ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం తెల్లవారు జాము నుండి గంటల తరబడి పడి గాపులు కాయాల్సిన దుస్థితి నెలపొంది. ఎరువుల బస్తా కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టి వేచి ఉండాల్సిన పరిస్థితులు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట (Illandakunta) మండలంలో చోటుచేసుకున్నాయి.
ఇల్లందకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (Agricultural Co-operative Society) పరిధిలో ఉన్న గ్రామాలకు యూరియా లోడ్ వచ్చిందని సమాచారం రావడంతో మంగళవారం తెల్లవారుజాము నుండి యూరియా (Urea) కోసం రైతులు చెప్పులను వరుసలైనులో పెట్టి దాదాపు ఎనిమిది గంటల వేచి ఉన్నారు. 450 బస్తాల గాను వెయ్యి మందికి పైగా రైతులు వచ్చారు.
యూరియా కొరత వల్ల రైతులు (Farmers) ఎక్కువ మంది రావడంతో సొసైటీ సీఈవో (Society CEO) ఆదిత్య 450మందికి టోకెన్లను మంజూరు చేయగా, వరుస లైన్ లో నిలబడి ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా యూరియాను అందజేశారు. దీంతో మిగతా రైతులు మునుపు ఎన్నడు లేని విధంగా ఇలా యూరియా కొరత ఎందుకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తుతో టోకెన్ల ద్వారా రైతులకు పంపిణీ చేశారు.
