నగరాల వారీగా రేట్లు..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 24 క్యారెట్ల పసిడి ధరలు ఇప్పటికే లక్ష రూపాయలను బీట్ చేయగా, తాజాగా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. దేశంలో బంగారం, వెండి ధరలు లక్ష రూపాయల స్థాయి నుంచి దిగి రావడం లేదు. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,01,610కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,140 వద్ద నిలిచింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,19,900కు చేరుకుంది.
నగరాల వారీగా బంగారం ధరలు..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థానిక డిమాండ్, సరఫరా, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140, 24 క్యారెట్ల ధర రూ.1,01,610గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా ఉంది.
వెండి ధరలు కూడా బంగారంతో పాటు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర రూ.100 తగ్గిపోయి రూ.1,19,900కు చేరుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,29,900గా ఉండగా, విజయవాడలో రూ.1,29,900, ఢిల్లీ, ముంబయిలో కూడా కేజీ వెండి రేటు రూ.1,19,900 స్థాయిలో కలదు. అయితే స్థానిక మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలు మారవచ్చు.