భారత్, పాక్ మ్యాచ్ కు లైన్ క్లియర్..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: ఆసియా కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడుతుందా..? లేదంటే మ్యాచ్ బహిష్కరిస్తుందా..? క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ప్రశ్న ఇదే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకో వద్దన్న డిమాండ్ తీవ్రమైంది. అభిమానులే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా ఆ మ్యాచ్ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశం కంటే ఒక్క మ్యాచ్ ఎక్కువేం కాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో అసియా కప్ లో దాయాదుల పోరుపై సందిగ్ధం నెలకొంది. ఆసియా కప్ లో పాల్గొనడం, పాక్ తో ఆడటం ఆటగాళ్ల చేతుల్లోనో బీసీసీఐ చేతుల్లోనో లేదు. భారత ప్రభుత్వ నిర్ణయాన్నే బీసీసీఐ పాటిస్తుంది. అయితే, ఆసియా కప్ లో పాక్ మ్యాచ్ కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీ నేషనల్ ఈవెంట్లను అడ్డుకోబోమంటూ క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 14న పాక్ టీమిండియా తలపడటం ఖాయమే.

Leave a Reply