ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రేషన్ షాపులో బియ్యం తెచ్చుకోవాలంటే సాధారంగా వెంట బ్యాగు తీసుకెళ్తారు. కానీ ఇప్పడు ఆ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్తం (Telangana State Government) రేషన్‌కార్డుదారులకు పర్యావరణహిత బ్యాగులు (Eco Friendly Bags) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జిల్లాల పరిధిలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ల (గోదాము)కు ఇప్పటికే ఈ పర్యావరణహిత బ్యాగులు చేరుకున్నాయి. వీటిని ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలోని రేషన్ డీలర్లకు కార్డుల సంఖ్య ప్రకారం అధికారులు సరఫరా చేస్తారు.ఈ బ్యాగులపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అమలు చేస్తున్న ఆరు పథకాలను ప్రస్తావిస్తూ ‘అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదాన్ని ముద్రించి ఉంటుంది. వచ్చే నెలలో అందజేసే ఈ సంచులను ప్రతి నెలా బియ్యం కోసం వెళ్లేటప్పుడు తీసుకెళ్తే సరిపోతుంది. ప్రస్తుతం బ్యాగులు స్టాక్ పాయింట్లో సిద్ధంగా ఉన్నాయి.. వచ్చే నెల కోటాకు సంబంధించి బియ్యంతో పాటు బ్యాగులను రేషన్ దుకాణాల్లోనే అందజేస్తారు. ప్లాస్టిక్ బ్యాగుల ఉపయోగాన్ని త్యజించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రేషన్ కార్డుదారులకు బ్యాగులు
