గీసుగొండ, ఆగష్టు 14 (ఆంధ్రప్రభ) : స్థానిక సంస్థల‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Thanniru Harish Rao) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం గీసుగొండ మండలం కొనాయిమాకుల గ్రామంలో మాజీ జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు నివాసంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Challa Dharma Reddy) తో కలిసి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎరువుల కొరతపై, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడగగా.. సరైన సమయంలో పంటలకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్ళివ్వక.. కావాల్సిన ఎరువులు అందివ్వకపోవడం వల్ల సొసైటీల్లో కూర్చోలేక పోతున్నామని సొసైటీ చైర్మన్లు (Society Chairmen) హరీష్ రావుకి తెలియజేశారు.

అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే కరువని.. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి (Government) లేదన్నారు. రైతులకు అప్పుడు ఇప్పుడు అండగా బీఆర్ఎస్ ఉంటుందని తెలిపారు. వచ్చే వినాయక చవితి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ (Notification of Local Body Elections) వచ్చేలా ఉందని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా (Social media) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, మాజీ జడ్.పీ.టీ.సి. పోలిస్వి ధర్విమా రావు, మాజీ ఎనుమాముల మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, మాజీ సర్పంచ్ లు పూండ్రు జైపాల్ రెడ్డి, బోడకుంట్ల ప్రకాష్, బి ఆర్ ఎస్ నాయకులు చల్లా వేణుగోపాల్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గోలి రాజయ్య, ముంత రాజయ్య, యూత్ నాయకులు మంద రాజేందర్, సిరిసే శ్రీకాంత్, కోట ప్రమోద్, అభిషేక్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply