ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుండి దిల్లీ–వాషింగ్టన్ డీసీ నాన్‌స్టాప్ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం 26 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు విస్తృత రిట్రోఫిటింగ్ పనులు (టెక్నిక‌ల్ సదుపాయాలు అప్‌గ్రేడ్ చేయడం) జరుగుతున్నాయి. దీని వలన తాత్కాలికంగా విమానాల కొరత ఏర్పడిందని, అందువల్ల ఈ రూట్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

అదనంగా, పాకిస్థాన్ గగనతలం మూసివేత కొనసాగుతుండటంతో, సుదూర అంతర్జాతీయ ప్రయాణాల షెడ్యూల్‌లో మార్పులు తప్పనిసరి అయ్యాయని తెలిపింది.

2026 వరకు ప్రభావం ఉండొచ్చు

ఈ రిట్రోఫిటింగ్ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రయాణికుల సౌకర్యాన్ని, అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యం అని ఎయిర్ ఇండియా చెబుతోంది. అయితే, ఈ పనుల కారణంగా 2026 చివరి వరకు కొన్ని విమానాలు ఎప్పుడైనా అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది.

ప్రయాణికులకు ఆప్షన్లు

సెప్టెంబర్ 1 తర్వాత ఢిల్లీ–వాషింగ్టన్ మార్గంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి, రీబుకింగ్ లేదా పూర్తి రీఫండ్ ఆప్షన్లు అందిస్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ప్రయాణికుల ఆర్థిక, సమయ సౌకర్యాలకు అనుగుణంగా ఇతర విమాన మార్గాలను సూచిస్తామని తెలిపింది.

Leave a Reply