ఒకపక్క వర్షాలు.. వరదలు.. దిగువ ప్రాంతాలు ముంపు.. ఇలా రకరకాల సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోపక్క చాప కింద నీరులా ఇంకో సమస్య వేగంగా వ్యాపిస్తుంది. అదేమిటో తెలుసా వైరల్ ఫీవర్స్ (Viral fevers) అవును. ఇవి దోమల (Mosquitoes) వల్లనో, కలుషిత మంచినీటి (Contaminated fresh water) వల్లనో, లేదా నిలిచి ఉన్న నీటి మీద వాలిన దోమలు, ఇలా రకరకాల కారణాల వల్ల అపరిశుభ్రత (Uncleanness) కలిగిన ఆహారం వలన వేగంగా వ్యాపిస్తున్నాయి. జ్వరాల రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు (Hospitals) కిటకిటలాడుతున్నాయి. అందరికీ అందుబాటులో వైద్యం ఉన్నా.. లేకున్నా వెంటనే ఉపశమనం ఎలా పొందాలి.. ఎలా ఈ జ్వరాల నుంచి తమను కాపాడుకోవాలి..

ఇలా వైరల్‌ ఫీవర్స్‌ వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. వైద్య నిపుణుల సూచనల ప్రకారం—

తాగునీరు: ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటినే తాగాలి.

దోమల నివారణ: ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనీయకుండా చూడాలి. దోమతెరలు, కాయిల్‌లు లేదా లిక్విడ్ వెపరైజర్లు ఉపయోగించాలి.

ఆహారం: వీధి భోజనాన్ని వీలైనంతవరకు నివారించాలి. ఇంట్లో తయారైన వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

వ్యక్తిగత పరిశుభ్రత: చేతులు సబ్బుతో తరచుగా కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు రుమాలు లేదా మాస్క్ ఉపయోగించాలి.

లక్షణాలు గమనిస్తే: అధిక జ్వరం, వణుకు, శరీర నొప్పులు, వాంతులు, కళ్ళు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప వైద్యుడిని సంప్రదించాలి.

ప్రజలు రోగాలు మనదరికి చేరకుండా జాగ్రత్తగా ఉంటే రోగాలు రాకుండా కాపాడుకోచ్చు..

Leave a Reply