IND vs ENG | రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్ దూకుడు.. !!

ఓవల్‌లో జరుగుతున్న ఆఖ‌రి 5వ‌ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట వెలుతురు సమస్యల కారణంగా ముందుగానే ముగిసింది. ఇదిలా ఉండగా, టీమ్ ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పై 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇంగ్లాండ్ ను 247 ప‌రుగుల వ‌ద్ద క‌ట్టడి చేసిన భార‌త్.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించ‌గా.. ఓపెన‌ర్ యశస్వి ధనాధన్ బ్యాటింగ్ చేస్తూ హాఫ్ పెంచరీతో ఆకట్టుకున్నాడు. కాగా, రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్ కు షాక్ తగిలింది. జైస్వాల్ తో పాటు బరిలొకి దిగిన రాహుల్ (7) జోష్ టంగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ (11) గస్ అట్కిన్సన్ బౌలింగ్ లో పెవిలయన్ చేరాడు.

ఇక స్టంప్స్ ప్రకటించే సమయానికి యశస్వి (51), నైట్ వాచ్‌మన్ ఆకాశ్ దీప్ (4) కలిసి భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 75/2 వద్ద నిలిపారు.

ఐదో టెస్ట భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 224/10

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 247/10

భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోర్ 75/2 (డే 2.)

Leave a Reply