AP | శ్రీశైల మల్లన్న సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి…

నంద్యాల బ్యూరో, జులై 19 (ఆంధ్రప్రభ) : జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం (Srisailam)లో వెలిసిన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి (Sri Bhramarambika Mallikarjuna Swamy) దేవస్థానంలో స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి (AP High Court Judge) వై.లక్ష్మినారాయణ దంపతులు శనివారం దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్ల దర్శనార్ధమై ఉదయం ఆలయ రాజగోపురం (Temple tower) వద్దకు చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు (M. Srinivasa Rao) అర్చక వేదపండితులు ఆలయ సంప్రదాయంలో భాగంగా స్వాగతం పలికారు.

వీరు భ్రమరాంబిక మల్లికార్జునస్వామి వారికి విశేష రుద్రాభిషేకం చేపట్టారు. శ్రీ భ్రమరాంబదేవికి విశేష కుంకుమార్చనాదివిశేష పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ సంప్రదాయంలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తి దంపతులకు అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనాలు వల్లించారు. కార్యనిర్వహణాధికారి స్వామి అమ్మవార్ల శేషవస్తాలను, స్వామివార్ల జ్ఞాపిక, ప్రసాదములనిచ్చి సత్కరించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply