చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ (Chennur) మండలం పొక్కూర్ గ్రామంలో ఈరోజు వేకువజామున సీఐ దేవేందర్ రావు (Devender Rao) ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కమ్యూనిటీ కాంట్రాక్ట్ (Community Contract) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సరైన ధ్రువ పత్రాలు లేని 50 బైక్ లు, రెండు ఆటోలు, 20 లీటర్ల నాటుసారా, 1000 లీటర్ల గుండుంబా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Chennur |కమ్యూనిటీ కాంట్రాక్ట్.. పలు వాహనాలు సీజ్

