Kavitha vs Mallanna | mandali మండలి నుంచి తీన్మార్‌ మల్లన్న సస్పెండ్‌ – గుత్తాను కోరిన కవిత

హైదరాబాద్ : సమాజం తల దించుకునేలా.. మహిళా లోకాన్ని అవమానించేలా తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతోంది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలను మహిళా లోకం తిప్పికొడుతోంది. తనపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ తీన్మార్‌ మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఖబడ్దార్‌.. తాము తలచుకుంటే ఇంట్లకెళ్లి బయటకు కూడా రాలేవు బిడ్డా అని హెచ్చరించారు. ఎమ్మెల్సీగా ఉండడానికి తీన్మార్‌ మల్లన్న అర్హుడే కాదని.. వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ బిడ్డా అయితే ఏదీ పడితే అదీ మాట్లాడితే సరికాదని హితవు పలికారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్‌ కుమార్‌పై హైదరాబాద్‌లో శాసనమండలి చైర్మన్‌ సుఖేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుంది. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుంది. రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి’ అని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బీసీ బిడ్డా కాబట్టి ఏదీ పడితే అదీ మాట్లాడితే సరికాదని స్పష్టం చేశారు. ‘తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలకు మా వాళ్లకు కోపం వచ్చి నిరసన చేశారు. ఇంత మాత్రానికే తుపాకీ కాల్పులు చేసి చంపేస్తారా? ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా?’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేయాలని.. ఎమ్మెల్సీగా సస్పెండ్‌ డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత దారుణ సంఘటన జరిగినా డీజీపీ అందుబాటులో లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

:ఖబడ్దార్‌ తీన్మార్‌ మల్లన్న.. ఇంట్లకెళ్లి బయటకు రాలేవు బిడ్డా!

హైదరాబాద్‌లోని శాంతిభ్రదతల ఐజీకి ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు వివరించడమే కాకుండా వాటికి సంబంధించి దృశ్యాలను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు

. ‘నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేయడానికి వస్తే డీజీపీ లేరు. ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే డీజీపీ కార్యాలయానికి రాకపోవడం అంటే దీని వెనక ప్రభుత్వం కూడా ఉందని మేం అనుకోవాల్సి వస్తుంది’ అని ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు.

‘మా తెలంగాణ జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లన్ననా ? లేక ప్రభుత్వమా? అనేది తెలియాలి’ అని కవిత తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ప్రకటించారు.

‘అసలు గన్‌మెన్స్ ఎందుకు షూట్ చేయాల్సి వచ్చిందనేది తెలియాలి. మల్లన్న ఆదేశాలు లేకుండా గన్‌మెన్స్ షూటింగ్ చేయరు. మా కార్యకర్తలపై కాల్పులు జరిపిన తీన్మార్ మల్లన్న గన్‌మెన్‌లను వెంటనే డిస్మిస్ చేయాలి’ అని కవిత డిమాండ్‌ చేశారు.

‘తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏ గన్‌మెన్ కానీ.. పోలీసులు కానీ కాల్పులు జరపలేదు. కానీ ఈ రోజు తీన్మార్ మల్లన్న గన్‌మెన్స్ ఇలా కాల్పులు జరపడం బాధాకరం’ అని తెలిపారు.

రేపు మహిళా కమిషన్‌కు

అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్‌ చేయాలనే డిమాండ్‌తోపాటు కఠిన చర్యలు తీసుకునేందుకు కవిత సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రేపు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అపాయింట్‌మెంట్‌ కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మహిళలను కించపరిచేలా మాట్లాడిన చింతపండు నవీన్‌కుమార్‌పై మహిళా కమిషన్‌లో ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రెహట్కర్‌ని కూడా కలిసి తీన్మార్ మల్లన్నపై కవిత ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.

Leave a Reply