మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూ వివాదంలో కర్ణాటక హైకోర్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, ఆమె సోదరుడు బీఎం మల్లికార్జున స్వామికి నోటీసులు జారీ చేసింది. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మైసూరు విజయనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కి కూడా నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 4కి వాయిదా వేసింది.
ఈ కేసులో స్నేహమయి కృష్ణ, సీఎం సిద్ధరామయ్య, భూ యజమాని దేవరాజు దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వి.కామేశ్వరరావు, న్యాయమూర్తి సి.ఎం.జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ పరిశీలించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ స్నేహమయి కృష్ణ కోర్టులో వాదించారు. మరోవైపు ఈ కేసును కొట్టేయాలని సిద్ధరామయ్య, దేవరాజు కోర్టును అభ్యర్థించారు.