కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు మృతిచెందారు.. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్దనున్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను స్కార్పియో వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో కమల్ భాష (50), మున్నా (35), షేక్ నదీయా (3) మృతిచెందగా.. మరో ఆరుగురుకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లా మైదుకూరు చెందిన కమల్ బాషా, మున్నా, గులాబ్, ఖాదర్ వలీ, నబియా మున్నా.. హైదరాబాద్ విహారయాత్రకు స్కార్పియో వాహనంలో వెళ్లారు. హైదరాబాద్ నుండి మైదుకూరుకు తిరిగి వెళ్తుండగా.. ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను స్కార్పియో వాహనం ఢీకొట్టడందో ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడి అక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రగాయాలపాలయ్యారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఓర్వకల్లు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు.