బాసర, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన బాసర (Basara ) శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో మంగళవారం వైభవంగా గురు పౌర్ణమి (guru pournima ) ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు (offer prayer ) చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, ఆలయ వంశపారంపర్య సభ్యుడు శరత్ పాఠక్, ఆలయ సిబ్బంది అర్చకులు వేదపండితులు భక్తులు పాల్గొన్నారు.
వేదవ్యాస మహర్షికి ఆరాధనోత్సవం
బాసరలో ఉన్న వేద వ్యాసాల ఆలయంలో వేద వ్యాస మహర్షికి అర్చకులు, వేద పండితులు ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయం నుండి శ్రీ వేద వ్యాస ఆలయం వరకు మంగళవాయిద్యాలతో తిరువీధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అర్చకులు వేద పండితులు శాంతి మంత్ర పఠనం, ఉత్సవ సంకల్పం, గణపతి పూజ, పుణ్యా హవచనం, రుత్విగ్వరణం అగ్నిస్థాపన చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం వేద పండితులు వేద పారాయణం నిర్వహించారు. సాయంత్రం స్థాపితా దేవత పూజ నీరాజనం మంత్రపుష్పాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.