గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 17
యుక్తాహారవిహారస్య
యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య
యోగో భవతి దు:ఖహా ||
తాత్పర్యము : నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను తగ్గించుకోగలడు.
భాష్యము : శారీరిక అవసరాలైన ఆహారము, నిద్ర, రక్షణ మరియు మైధునము అనేవి మితిమీరినట్లయితే యోగాభ్యాసమునకు అవరోధాలుగా మారుతాయి. కృష్ణ చైతన్యవంతుడు కృష్ణుని కోసమే ఆయన సేవకు సంబంధించిన వాటిని మాత్రమే నిర్వహించేటట్లు శిక్షణనివ్వబడతాడు. కాబట్టి కృష్ణ ప్రసాదాన్నే భుజిస్తూ, తక్కువగా నిద్రిస్తూ, కృష్ణుని సేవలో నిముషమైనా తీరిక లేకుండా పనిచేస్తూ ఉండే భక్తునికి ఇంద్రియ తృప్తి చేసేందుకు సమయము మిగలదు, మరియు దాని నుండీ వచ్చే దు:ఖమూ ప్రాప్తించదు. హరిదాస ఠాకూరు అనే గొప్ప భక్తుడు ప్రతిరోజు నియమము ప్రకారము మూడు లక్షల నామములను జపించనిదే భుజించేవాడు కాదు లేదా నిద్రించేవాడు కాదు ఇదే సరియైన యోగమునకు ఒక ఉదాహరణ. ఓం తత్సదితి శ్రీమద్భగవ ద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
కర్మసన్న్యాసయోగోనామ పంచమోధ్యాయ: ||
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి ాభక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..
Bhagavatgita | గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 17
