Wazedu | ఘనంగా పీర్ల‌ పండుగ

కుల మతాలకతీతంగా భక్తులు హాజరు


వాజేడు, జులై 5 (ఆంధ్రప్రభ ) : ములుగు జిల్లా వాజేడు (Wazedu) మండల పరిధిలోని పేరూరు కృష్ణాపురం గ్రామంలో పీర్ల‌ పండుగ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పీర్ల‌ పండుగ వేడుకకు భక్తులు (devotees) కుల‌మతాలకతీతంగా హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు.

పీర్ల‌ ఉగ్రం వచ్చిన వ్యక్తులు పీర్ల‌ను పట్టుకుని అగ్నిగుండంలో ఎగురుతూ పీర్ల‌లో ఉన్న నిష్టను చూపుతున్నారు. ఈ వేడుకను తిలకించడానికి మండల నలుమూలల నుండి గ్రామ గ్రామాన భక్తులు తరలి వస్తున్నారు. గత ఆదివారం ప్రారంభమైన ఈ వేడుక నేటి సోమవారంతో ముగియనుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

Leave a Reply