Diamond: వ్యవసాయ కూలీకి జాక్ పాట్.. ఆ వ‌జ్రం ధ‌ర ఎంతంటే..?

కర్నూలు : తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో కర్నూలు (Kurnool) జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. కొన్ని రోజులుగా జనం, రైతులు తమ అదృష్టంను పరీక్షించుకునేందుకు వజ్రాల వేట (Diamond hunting) కోసం పొలాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కొందరికి విలువైన వజ్రాలు దొరికాయి. ఇప్పటికే తుగ్గలి మండలంలో మదనంతపురం, జొన్నగిరిలో విలువైన వజ్రాలు లభించగా.. తాజాగా పెండకల్ గ్రామంలో ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభ్యమైంది.

తుగ్గలి మండలం (Tuggali Mandal) పెండకల్ గ్రామంలో వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం దొరికింది. విషయం తెలిసిన ఓ వ్యాపారి.. ఆ డైమండ్‌ను రూ.10 లక్షలకు అడిగాడు. రేటు కుదరకపోవడంతో ఆ వ్యాపారి నిరాశగా వెనుదిరిగాడు. వజ్రం విలువ రూ.50లక్షలు ఉంటుందని తెలుస్తోంది. వజ్రం కొనుగోలు కోసం వ్యవసాయ కూలీ దగ్గరికి వ్యాపారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో అతడు భారీ ధర చెబుతున్నాడు. ఏదేమైనా ఆ వ్యవసాయ కూలీ పంట పండిందనే చెప్పాలి. విషయం తెలిసిన జనాలు డైమండ్‌ను చూసేందుకు పెండకల్ గ్రామంకు బారులు తీరారు. అంతేకాదు సదరు ప్రాంతంలో డైమండ్స్ కోసం గాలిస్తున్నారు.

Leave a Reply