TG | హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం..

  • సుప్రీంకోర్టు కొలీజియం అంగీకారం

తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు ప్రముఖ అడ్వకేట్లను జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం (గురువారం) కీలకంగా అంగీకారం తెలిపింది. కొలీజియం సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, గైస్ మీరా మోహియిద్దిన్, సుద్దాల చలపతి రావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్‌లను హై కోర్టు జడ్జిలుగా నియమించేందుకు అంగీకరించబడింది.

ఇప్పటి వరకు వారు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్‌లుగా ఉన్నారు. ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టు న్యాయవ్యవస్థ మరింత బలపడనుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జడ్జి స్థానాలను భర్తీ చేయడంలో ఈ నియామకాలు కీలకమైన దశగా భావిస్తున్నారు.

Leave a Reply