TG | ఖ‌ర్గే స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి.. డిప్యూటీ సీఎం భ‌ట్టి పిలుపు !

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఈ నెల 4న రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఎల్బీ స్టేడియం వేదిక‌గా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

ఖర్గే పర్యటన నేపథ్యంలో ఈరోజు (బుధవారం) డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

దేశంలోనే తొలిసారిగా గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా ముఖాముఖి సమావేశం కానున్నారని డిప్యూటీ సీఎం వివరించారు. ఇదే మొదటి ప్రయత్నంగా, ఈ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రానికే తొలి గౌరవం దక్కినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలను అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించనున్న‌ట్టు వివ‌రించారు. ఇంతటి ముఖ్యమైన సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

డిప్యూటీ సీఎం పిలుపు..

“సాయంత్రం 3 గంటలకల్లా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ నేతలు, జిల్లా అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో సభకు హాజరై విజయవంతం చేయాలి. ఖర్గే తో ప్రత్యక్షంగా మాట్లాడే అరుదైన అవకాశం ఇది. అందరూ బాధ్యతగా తీసుకోవాలి.”

ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలంగా పునఃప్రారంభం అయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పార్టీ నేతలు సద్వినియోగం చేసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు.

Leave a Reply