Medaram | మేడారం మహా జాతర తేదీలు ఫిక్స్

ములుగు:

తెలంగాణ (Telangana) సంస్కృతి, (culture) సంప్రదాయాలకు (traditional) ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara) తేదీలు ఖరారయ్యాయి.

మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి (January ) 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది.

తొలిరోజు జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న చిలకల గుట్ట నుంచి సమస్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.ఆపై 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 31న సమస్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు కోరారు.

కాగా.. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం జాతర జరుగుతుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ.

Leave a Reply