Phone Tapping| నేడు సిట్ ముందుకు టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్‌ (phone Tapping) కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ SIB )మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావును +Prabhakar Rao ) సిట్ (sit ) అధికారులు ఇటీవల విచారించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్‌ అధికారులు విచారణ చేస్తున్నారు.

నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు మొదటి సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్నది సిట్..

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ కు వాంగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను ప్రణీత్ రావు టీమ్ 2023 లో 15 రోజులకు పైగా ట్యాపింగ్ చేసింది. ప్రణీత్ రావు ఫోన్ డేటలో 400 ఫోన్ నంబర్లు బయటపడ్డాయి.

నేడు మరోసారి ప్రభాకర్‌రావు విచారణ

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు మంగళవారం మరోసారి సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. బుధవారం ప్రణీత్‌ రావును సిట్‌ విచారించనుంది. ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైన వారి జాబితాలో ఉన్న గద్వాల జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జి సరితను కూడా వాంగ్మూలం ఇవ్వటానికి మంగళవారం తమ ఎదుట హాజరుకావాలని సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు, సిట్‌ ఎదుట హాజరుకానున్నట్లు సరిత తెలిపారు

Leave a Reply