AP | దేశ‌మంతా డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ ను కోరుకుంటున్న‌ది : బండి సంజ‌య్

తిరుప‌తి : దేశమంతా ప్రధాని మోడీ (Prime Minister Modi) నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్‌ను కోరుకుంటోందని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్‌ వల్లే ఏపీలో అభివృద్ధి మెరుపు వేగంతో జరుగుతోందని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. తిరుపతిలో కేంద్రమంత్రి బండి ఇవాళ‌ పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… మోదీ 11 ఏళ్ల పాలన విశేషాల‌ను వివ‌రించారు.

ఇప్పటికే ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ఇచ్చిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,741 కి.మీ హైవేలను నిర్మించామని వెల్ల‌డించారు. పలు ఎయిర్‌పోర్టు (Airport) లను మరింత ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైల్వే బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేశామని, అమృత్ మహోత్సవంలో భాగంగా.. రాష్ట్రంలోని అనేక రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే ఏపీకి 24 లక్షల ఇళ్లను మంజూరు చేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్ల‌డించారు.

Leave a Reply