Visakha – బైక్ ను డీ కొన్న బస్సు – ఒకరి దుర్మరణం
గోపాలపట్నం : గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు ద్విచక్ర వాహనదారున్ని ఢీ కొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు కొత్తపాలెం ఆదర్శనగర్ కు చెందిన ఉమ్మి వెంకట బాలాజీ గుర్తించారు.. ఇంజనీరింగ్ పూర్తిచేసి షిప్ యార్డ్ లో అప్రెంటీస్ గా పనిచేస్తున్నాడు
ఉమ్మి ఆదినారాయణ కార్పెంటర్ గా విధులు నిర్వహిస్తూ ఆయనకు ఇద్దరు కుమారులను ఉన్నతమైన చదువులు చదివించారు. తన పెద్ద కుమారుడు ఉమ్మి వేణుగోపాలరావు డబ్ల్యూఎన్ఎస్ కంపెనీలో సత్యం కంప్యూటర్స లో పనిచేస్తున్నాడు. తన సోదరుడును దింపటానికి ద్విచక్ర వాహనంపై వచ్చి మృత్యువాత పడ్డాడు ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలం వద్దకు వచ్చి బోరును విలపించారు.
ట్రాఫిక్ సి ఐ శ్రీనివాసరావు ఎస్ ఐ లా అండ్ ఆర్డర్ ఎస్సై అప్పలనాయుడు సంఘటన స్థలం వద్దకు వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును అదుపులోకి తీసుకున్నారు ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో రోడ్డు ప్రమాదం గురైన వ్యక్తిని శవ పంచనామా కోసం కేజీహెచ్ కు తరలించారు.