అనంతపురం జిల్లాలో టీడీపీ నేతపై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.. పెద్దపప్పురు మండలం తిమ్మనచెర్వుకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కట్టుబడి మనోజ్ పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల డ్రైవర్ రాజు, అతని తమ్ముడు కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు..
ఈ ఘటనలో మనోజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.. అతడి శరీరంపై కత్తిగాట్లు కనిపిస్తున్నాయి.. అయితే, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే మనోజ్‌ను ఆస్పత్రికి తరలించారు.. బాధితుడు మనోజ్ కు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు వైద్యులు..
మరోవైపు.. హుటాహుటిన తాడిపత్రి ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి.. బాధితుడు మనోజ్ ను పరామర్శించి.. ధైర్యం చెప్పారు.. అయితే, వ్యక్తిగత కారణాలతో మనోజ్‌పై దాడి చేశారు..? లేదా రాజకీయ కారణాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది..

