ముంబయి: టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే, జూన్ 20 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీసికి బీసీసీఐ జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. టి 20 లో పరుగుల వరద పారించిన సాయి సుదర్శన్ కు , రంజీలో సెంచరీలతో కదం తొక్కిన వెటరన్ బ్యాటర్ కరణ్ నాయర్ కు టెస్ట్ టీమ్ చోటు కల్పించారు..
అందరూ ఊహించినట్టే.. భారత జట్టు 37వ టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ నియమితులయ్యాడు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇవాళ సమావేశమైన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌తో జరిగే 5 టెస్ట్‌ల సిరీస్‌కు 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు.
జట్టులో గిల్, పంత్, యశశ్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, జడేజా, ధ్రువ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.
జట్టు
