Soundarya Lahari – సౌందర్య లహరి 92

 92. గతా స్తేమంచత్వంద్రుహిణహరిరుద్రేశ్వరభృతః
శివ స్వచ్ఛచ్ఛాయా కపట ఘటితప్రచ్ఛదపటః
త్వదీయానాంభాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీశృంగారో రస ఇవ దృశాందోగ్ధికుతుకం.        

              తాత్పర్యం: అమ్మా! జగజ్జననీ! బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు నలుగురు నీవు అధిష్ఠించు మంచము యొక్క నాలుగుకోడుల రూపంలో ఉన్నారు. సదాశివుడు తన స్వచ్ఛమైన తెల్లని కాంతితోకూడిన దుప్పటి అయి, ఎఱ్ఱని నీ మేని కాంతులు ప్రతిఫలించటం వల్ల ఎఱ్ఱగా మారిపోయి, మూర్తీభవించిన శృంగారరసం లాగా కనువిందు చేస్తున్నాడు.      

  • డాక్టర్ అనంత లక్ష్మీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *