తెలంగాణలో మందుబాబులకు మరో పెద్ద షాక్ తగిలింది. ఇటీవల బీర్ల ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లిక్కర్ ధరలను పెంచింది. క్వార్టర్‌పై రూ.10, ఆఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు రేపటి (సోమవారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
కాగా, చీప్ లిక్కర్, బ్రీజర్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.