కేంద్ర హోంమంత్రి నివాసంలో హైలెవల్ భేటీ
గుజరాత్ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్
భుజ్‌లో క్షిపణి దాడులపై ఆరా
ఆర్మీ చీఫ్‌కు ప్రత్యేక అధికారాలిచ్చిన కేంద్రం
టెరిటోరియల్ ఆర్మీని వినియోగించుకునే అవకాశం
న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ :
పాక్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో హైలెవల్ మీటింగ్ జరిగింది.. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఐబీ డీజీ, బీఎస్ఎఫ్ డీజీ, సీఐఎస్ఎఫ్ డీజీ , హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ పాల్లొన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. యుద్ద వ్యూహాలపై చర్చించారు. అలాగే త్రివిధ దళాలు గత రాత్రి జరిపిన దాడుల్లో మనవైపు నుంచి ఎటువంటి నష్టం జరగపోవడంపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరకుండా కాపాడిన త్రివిధ దళాలను అభినందించారు.
గుజరాత్ సీఎంకు ప్రధాని ఫోన్..
గుజరాత్‌లోని భుజ్ టార్గెట్‌గా పాక్ మిస్సైల్ దాడి జరిపిన నేపథ్యంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సరిహద్దులో పరిస్థితులు, ప్రభుత్వం సన్నద్ధతపై ఆరా తీశారు. ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. కచ్, బనాస్కాంతా, పాటణ్, జామ్‌నగర్ జిల్లాల్లో పౌరుల భద్రత గురించి తీసుకున్న చర్యలపై సీఎం పటేల్ ప్రధానికి వివరించారు..అవసరమైతే సరిహద్దు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మోదీ సూచించారు..