TG | నాట్కో హైస్కూల్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

కొత్తూరు, మే 7(ఆంధ్రప్రభ): కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన నాట్కో జిల్లా ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యాశాఖ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. నాట్కో పరిశ్రమ నిర్వాహకులు సీఎస్ఆర్ నిధులతో కొత్తూరు ఉమ్మడి మండల ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్యం అందించటం కోసం చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply