ప్రకృతిలో ప్రతి దానిలో గుణత్రయము ఉంటుంది. పరమాత్మ ఒక్కడే అయినా ఒక్కొక్క గుణం తీసుకుని ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క నామంతో పనులు చేస్తాడని, సత్త్వ గుణంతో విష్ణునామంతో రక్షణ చేసాడని, రజో గుణంతో బ్రహ్మనామంతో సృష్టి చేస్తాడని, తమో గుణంతో, రుద్రనామంతో సంహారం చేస్తాడని భాగవతంలో స్పష్టం చేయబడింది.
శరీరానికి బలాన్ని, తుష్టిని కల్గిస్తాయని అందదు అన్ని రకాల ఆహారాలు తీసుకోలేరు. మనం తీసుకునే ఆహారమే మన మనస్సుగా మారుతుందని వేదం ఘోషించింది. కావున సాత్వికాహారమే తీసుకోవాలని, రాజసం మధ్యమమని, తామసం పనికి రాదని శాస్త్ర వచనం ఆహారంలో గుణ నియమం ఉన్నట్లే దైవంలో కూడా గుణ నియమాలు పాటించాలి. మోక్షం కావాలంటే సాత్విక మూర్తిని, కోరికలు తీరాలంటే రాజస మూర్తిని, స్వార్థం పరహింస కోరుకునే వారు తామస మూర్తిని ఆరాధించాలి. స్వామీజీలు అంటి సాత్విక మూర్తులు, సాత్విక మూర్తినే ఆరాధిస్తారు. సామాన్యులు కూడా తామస గుణాన్ని భూత, ప్రేత, పిశాచాలను, వారి అధిపతులను ఆరాధించకూడదని శాస్త్ర వచనం. అందుకే తమో గుణంతో ఉన్న శంకరుడైనా జ్ఞానాన్ని బోధించడానికి రామావతారంలో హనుమంతుడిగా, కృష్ణావతారంలోని శుకయోగేంద్రుడిగా అవతరించాడు. ‘జ్ఞానంతు శంకరాధిచ్ఛేత్’ అని రుద్రుడు తామసమూర్తి అయితే శంకరుడు. సాత్వికుడై జ్ఞానాన్ని భోదించాడు. స్మశానవాసి, భూత, ప్రేత, పిశాచ అధిపతిగా ఉండేది రుద్రుడు, జ్ఞానమూర్తిగా ఉండేది సదాశివుడు.
దేవుళ్ళంతా ఒక్కటే అయినప్పుడు స్వామీజిలు కూడా దైవబేధాలను చూపించవచ్చా?
