నేటి రాశిఫలాలు 30.04.25

మేషరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభరాశి బాధ్యతలు పెరిగినా నమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. సన్నిహితులతో అకారణంగా విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా తప్పనిసరి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ధనలాభం పొందుతారు. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

మిథునరాశి రుణ వత్తిడుల నుంచి విముక్తి చెందుతారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందుతారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు, సత్కారయోగం ఉంది. ఆకస్మిక ధన లాభం పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటకరాశి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు, హోదాలు దక్కుతాయి. కొత్త పనులు, కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టులు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

సింహరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని విధంగా అతిథుల నుంచి శుభఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.విలువైన కాంట్రాక్టులు దక్కుతాయి. ఖర్చులవిషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కన్యరాశి వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవనరాలకు డబ్బు అందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ధన లాభం పొందుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

తులరాశి బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త మిత్రులు పరిచయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చే సూచనలు గోచరిస్తున్నాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం.

వృశ్చికరాశి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. దూరప్రాంతాల నుంచి అందిన ఓ వార్త కుటుంబంలో సంతోషానికి కారణం అవుతుంది. వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సురాశి వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. కుటుంబసభ్యులతో కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. పదోన్నతులు, హోదాలు దక్కుతాయి.

మకరరాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందకు సాగుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రాంభించిన వ్యవహారాలు, చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం, పేరు, ప్రతిష్ఠలు పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

మీన రాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అరుదైన ఆన్వానాలు అందుతాయి. ఖర్చులు పెరిగినా ఆదాయం సమకూరుతుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *