కరీమాబాద్ ఏప్రిల్ 27 (ఆంధ్రప్రభ) ఉద్యమ స్ఫూర్తి తో ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తిచేసుకుని నేడు ఆదివారం ఎలుకతుర్తిలో రజతో త్సవ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆదివారం బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తొలి మేయర్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఉప్పెనల ప్రజలు, నాయకులు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీగా సభా ప్రాంగణానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. దారులన్నీ ఎలుకతుర్తి వైపే రజతోత్సవ పండుగకు పలు గ్రామాల నుండి జనం తరలుతున్నారు జన సమీకరణలో నాయకులు తలమునకలైపోయారు. ఉత్సాహంగా ..ఉద్రేకంగా.. కదం తొక్కుతూ, నాయకులు కార్యకర్తలు అభిమానులు, ఎల్కతుర్తి వైపు వడివడిగా తరలివస్తున్నారు.
రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న ఉమ్మడి జిల్లాల గులాబీ శ్రేణులు అశేష జనవాహినిగా సభాస్థలికి తరలివస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో భారీ బహిరంగ సభ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తక్కెళ్ళపల్లి రవీందర్రావు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గ్యాదరిబాలమల్లు. మాజీ మంత్రి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఒడిదల సతీష్ కుమార్ సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు సభ సాయంత్రం 4:30 నుండి 5 గంటల మధ్యన ప్రారంభం అవుతుందని తెలిపారు. వేసవి దృష్ట్యా సభకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చల్వపందిల్లు, ఆహార పొట్లాలు, తాగునీరూ, మజ్జిగ, డాక్టర్ల బృందంలనుఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.