చిట్యాల, ఏప్రిల్ 23( ఆంధ్రప్రభ) : జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని జడలపేటలో ఇవాళ వీధికుక్కల దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రత్న రమేష్ కుమార్తె నైనిశా ఇంటి వద్ద ఆడుకుంటుండగా అక్కడే ఉన్న మూడు వీధి కుక్కలు చిన్నారిని వెంటాడి తీవ్రగాయాలు చేసినట్లు తెలిపారు.
బాలిక నైనిశా మెడ చుట్టూ, వీపుపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు.