హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూములపైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు, బిఆర్ ఎస్ పార్టీ మాజీ ఎంపి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.. ప్రకృతి పరిరక్షణే తొలి ప్రాధాన్యం అంటూ సుప్రీం న్యాయమూర్తులు పేర్కొనడంపై వారికి అభినందనలు తెలిపారు.. ఇప్పటికే ధ్వంసం చేసిన వంద ఎకరాలలో అడవుల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ప్రశంసనీయమన్నారు. ఈ అటవీ పరిరక్షణకు,ప్రకృతి విధ్వంసం కాకుండా కాపాడటంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి సంతోష్ అభినందనలు తెలిపారు.
HCU Lands | ప్రకృతి పరిరక్షణే ఫస్ట్ .. సుప్రీం ఆదేశాలకు మాజీ ఎంపి సంతోష్ కుమార్ ప్రశంసలు
