Yedapally కురిసిన వర్షం… మురిసిన రైతన్న

Yedapally కురిసిన వర్షం… మురిసిన రైతన్న

ఎండల నుంచి ఉపశమనం.. వ్యవసాయ పనులకు ఊతం

ఎడపల్లి(Yedapally), ఆంధ్రప్రభ:

ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం ప్రజలకు, రైతులకు ఉపశమనం కలిగించింది. గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వర్షం కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షంతో గ్రామంలోని రహదారులు తడిసి ముద్దవగా, వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.

వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్న రైతులు ఈ వర్షం పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి నాట్ల సీజన్ ప్రారంభమైన సమయంలో వర్షం కురవడం అనుకూల పరిణామమని పేర్కొన్నారు. వర్షపు జల్లులతో పొలాలు తడవడంతో సాగు పనులకు ఊతం లభించిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply