Regonda బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

Regonda బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర

రేగొండ(Regonda), ఆంధ్రప్రభ:

గోరికొత్తపల్లి మండలంలోని సుల్తాన్‌పూర్, జగ్గయ్యపేట, గోరికొత్తపల్లి గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంగళవారం పరామర్శించారు.

సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మోటపోతుల సురేష్, జగ్గయ్యపేటకు చెందిన ఏలేటి రాధక్క, గోరికొత్తపల్లికి చెందిన కట్ల సురేష్ ఇటీవల మృతి చెందగా, వారి నివాసాలకు వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా మృతుల చిత్రపటాల వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గూటోజు కిష్టయ్య, కాశెట్టి రాజయ్య, సుధనబోయిన ఓం ప్రకాశ్, మటిక సంతోష్, చిగురుమామిడి కుమారస్వామి, పత్తి తిరుపతి, కానుగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply