Yedapally ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి జైలు శిక్ష

Yedapally ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి జైలు శిక్ష

ఎడపల్లి( Yedapally) , ఆంధ్రప్రభ:

ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నంబర్ 54/2020, సీసీ నంబర్ 111/2020 కేసులో బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి శివ మంగళవారం తీర్పు వెలువరించారు. ఎడపల్లి గ్రామానికి చెందిన రాజీవ్ నాయుడు (32)పై నమోదైన కేసులో భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 353, 452, 427, 290 కింద నేరాలు రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది.

దీంతో సెక్షన్ 353 కింద రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా, సెక్షన్ 452 కింద రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా, సెక్షన్ 427 కింద ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. మొత్తం రూ.1,500 జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 30 రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. విధించిన అన్ని జైలు శిక్షలు ఏకకాలంలో అమలులో ఉంటాయని తీర్పులో స్పష్టం చేసింది.

Leave a Reply